Tuesday, May 3, 2022

తాడిపత్రి గార్దభం కర్ణాటకలో

 ఒక ఙ్గాపకం - 18

"తాడిపత్రి గార్దభం కర్ణాటకలో"

 

 

"ఆపండి"  ప్రయాణికులలో నుంచి ఎవరో గట్టిగా అరిచిన అరుపుకు కీచుమని చప్పుడు చేస్తూ బస్సు ఆగింది. అప్పటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు వుంటుంది సంఘటన జరిగినప్పుడు.

అది పెళ్ళి బస్సు.  మా అన్నయ్య పెళ్ళికి కర్ణాటకలోని సింధనూరు లొ జరిగింది.  మా అన్నయ్య పెళ్ళి కర్ణాటకలోని సింధనూరు లో జరిగింది. పెళ్ళి ముగిసింది. మేమందరం తిరిగి వస్తున్నాము.

ఒక్క క్షణం ఎవ్వరికీ ఎమీ అర్థం కాలేదు. అలా ఎవ్వరు అరిచారో , ఎందుకు అరిచారో.

 

***

మేము తాడిపత్రి లో వుండేవాళ్ళం అప్పట్లో.  అది ఇప్పటి ఆంధ్రపదేశ్ లోని అనంతపురం జిల్లాలో వుంది. అప్పడు మా అప్ప (నాన్నగారు) తహసిల్దారు గా పనిచేసే వారు. అది రెవెన్యూ డిపార్ట్ మెంట్లో చాలా పెద్ద పోస్టని, ఆయనకు అక్కడి రాజకీయనాయకుల నుంచి చాలా వత్తిళ్ళు వుండేవని, అయినా సరే ఆయన ఎన్నడు ఎక్కడా రాజీ పడకుండా ఏది ధర్మమో అదే చేసి అందరి మన్ననలు పొందేవారని నాకు ఇటీవలకూడ చాలా మంది అప్పటికాలం మనుషులు చెప్పటం జరిగింది.

మా ఇంట్లో మాత్రం ఆడంబరాలు, అనవసరమైన ఐశ్వర్య ప్రదర్శనలు వుండేవి కావు. మా నాన్న గారు చాలా నిజాయితి పరులు, ముక్కు సూటిగా వ్యవహరించే వారు. ఆయనను అజాత శతృవు అని కూడా అనే వారు.

అప్పట్లో నాకు తెలిసేది కాదు గాని పెద్ద పెద్ద ఫాక్షనిస్టులు మా ఇంటికి వచ్చి చాలాసేపు ఆయనతో మాట్లాడి, ఆయనని నయాన భయాన కన్విన్స్  చేసే ప్రయత్నం చేసేవారు. చివరికి ఆయన వారికి వ్యతిరేకంగా  తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తపరచకుండా నవ్వుతూ మీరు ధర్మం ప్రకారం చేస్తున్నారు స్వామీ! ఏదో స్వార్థంతో మా ప్రయత్నం మేము చేసుకుందామని రావటమే గానీ, సరే మీరు చెప్పినట్టే కానీవ్వండి.

ఆయన నిర్ణయంవల్ల లాభపడిన పార్టీ వచ్చి ఆయనకు అనందంతో ఏదో బహుమతులు ఇవ్వబోతే అంతే స్థిరంగా తిరస్కరించే వారు.

ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా వున్నా, డెప్యూటి తహసిల్దారు గా వున్నా , తహసిల్దారుగా వున్నా, డెప్యూటి కలెక్టర్ గా వున్నా, ఆర్,డి. గా వున్నా ఆయన వ్యవహార శైలిలో విధమైన మార్పు లేదు. తాను నమ్మిన విధానాలకు కట్టుపడి పనిచేసే వారు. ఒకరి ప్రశంశలు ఆశించరు, ఒకరి బెదరింపులకు కృంగిపోలేదు.

ఇప్పటి సినిమా ఫక్కీలో చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్.

తాడిపత్రి లో మేము వుండినది మహా అంటే ఒకటిన్నర సంవత్సరాలు పీరియడ్ లో. తర్వాత అదే తాడిపత్రికి నేను నా వృత్తిరిత్యా అనేక సంధర్భాలలో వెళ్ళాను. ఇంకోసారి , అలాగే నా బాల్యంలో తాడిపత్రిలో జరిగిన అనేక సంఘటనలు ఇంకో సారి వివరంగా చెబుతాను.

 

పెళ్ళి అయ్యాక కర్ణాటకలోని సింధనూరు నుండీ మేమందరం తిరిగి వస్తున్నాము. వరుడు అంటే మా అన్నయ్య ఇంకో మూడు రోజుల తర్వాత, వస్తాడు అని ముసి ముసి నవ్వులు చిందిస్తూ చెప్పారు బంధువులు అందరూ.

వదినెమ్మని పిల్చుకుని అదే బస్సులో వస్తామని ఆశించిన నాకు అది ఒక అశనిపాతం లాగా అనిపించింది. భోరున ఏడ్చేశాను. నేను రాను , నేను కూడా సింధనూరులోనే వుండిపోతానని గోల చేసాను. ఎలాగో బలవంతపెట్టి నన్ను బస్సు ఎక్కించారు. నేను బస్సు ఎక్కానేగాని ముభావంగా వున్నాను.

అది నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంట్లో జరిగిన మొదటి పెళ్ళి. అన్నయ్య భార్య నాకు ఏమవుతుంది? ఆమెని నేను ఏమని పిలవాలి? పెళ్ళి తర్వాత ఆమె మన ఇంటికి వస్తుందా, అన్నయ్య అక్కడికి వెళతాడా ఇలాంటి ధర్మ సందేహాలన్నింటిని దాదాపు నెల రోజులనుంచి మా అమ్మ ని అడిగి తీర్చుకుంటూ వస్తున్నాను.

నాకు అంత చిన్నవయసప్పుడే మా అన్నయ్యకి పెళ్ళీ జరగటం, వదినెమ్మ ఇంటికి రావటం వల్ల ఇంచుమించు వారు నాకు అమ్మానాన్నలతో సమానంగా అనిపించేది. వారు కూడా నన్ను తమ ఒక కొడుకులాగానే చూసుకునే వారు.

****

అదీ నేపధ్యం.

ఇక ప్రస్తుత సంఘటన లోకి వద్దాం.

అరుపు నాగన్నది. అతను వృత్తిరిత్యా చాకలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తాత్కాలిక క్లాస్ ఫోర్ ఉద్యోగిగా చేస్తూ వుండేవాడు. మా అప్ప (నాన్న) తహసిల్దారుగా పని చేస్తున్న రోజులవి.

మా నాన్నగారు వీలయినంతవరకు పేదలకు సాయం చేయటంలో ముందుండే వారు.  తాత్కాలిక స్వీపర్ని సర్వీస్ రూల్స్ ఆధారంగా పర్మనెంట్ ఉద్యోగిగా మార్చేశాడు మా అప్ప. దాంతో అతనికి కొన్ని వేల రూపాయల అరియర్స్ వచ్చాయి. ఎందరో ఆఫీసర్స్ వచ్చారు వెళ్ళారు గానీ నాగన్న గోడు ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదట.  అతను రిక్వెస్ట్ చేయంగానే అతని కేసులోని మెరిట్ ఆధారంగా అతని పోస్టు ను పర్మనెంట్ చేశారు. అది తన ధర్మం అని భావించారు ఆయన. అంతే.  కానీ మా అప్ప తానేనాడు ఏదో గొప్ప పని చేసినట్టు గొప్పలు పోలేదు.

 నేను సనాతన ధర్మంలోని లోతులను అర్థం చేసుకునే కొద్ది, RSS లో క్రియాశీలకంగా గొప్ప గొప్ప వారిని కలిసే కొద్ది, ఇంకా కమ్యూనిస్టు నాయకులలో కూడా  పాతతరం నాయకులను గురించి తెలుసుకునే కొద్దీ మా అప్ప యొక్క ఔన్నత్యం నాకు అర్థం అవజొచ్చింది. ఆయన ఇజానికి కొమ్ము కాయలేదు. ఆయన ఒక నిజమైన నిఖార్సైన మేధావి.

 

నాగన్న పోస్టును మా అప్ప పర్మనెంట్ చేయటంతో అతను చాలా విశ్వాసపాత్రుడిగా వుండేవాడు మా అప్ప పట్ల , అలాగే మా కుటుంబం పట్ల కూడా. తనకోచ్చిన అరియర్స్ ఉపయోగించి కొన్ని గాడిదల్ని, కొంత భూమిని, చిన్న ఇల్లు కొనుక్కున్నాడట నాగన్న.  మా ఇంటికి రోజు వచ్చి రేవుకు బట్టలు తీసుకు వెళ్ళేవాడు. పనికి గాను అతనికి నెల నెల మా అమ్మగారి ద్వారావిడిగా మా స్వంత డబ్బులోంచి నాగన్నకి జీతం ఇవ్వందే ఒప్పుకొనే వాడు కాదు మా అప్ప. విషయంలో చిన్న చిన్న చర్చలు జరిగేవి అమ్మా, అప్పల మధ్య. కాని ఆయన నన్ను నా విధానంలో ఉండనివ్వండి అని నిక్కచ్చిగా చెప్పేవాడు.

 

ఇక ప్రస్తుత కథలోకి వస్తే.....

 

"నా గాడిద దొరికింది. నా గాడిద దొరికింది." అంటూ ఆనందంతో చిందులు వేస్తున్నాడు నాగన్న. మాకెవ్వరికి ఏమి అర్థం కాలేదు.

"కలేమన్న వచ్చిందా?" మిగతా వాళ్ళంతా అడుగుతున్నారు నాగన్నని.

 

అతని గాడిద ఒకటి తప్పిపోయిన మాట నిజమే. చాలా తీవ్రమైన మనస్థాపానికి గురయ్యాడు అతను. గత కొద్ది రోజులుగా గార్ధభం విషయమయి అతడు చాలా ఆందోళన చెందుతున్నాడు నిజానికి. తిరిగిన ప్రదేశం తిరగకుండా, అడిగిన వారిని అడగకుండా చాలా ప్రయత్నాలే చేశాడు దానిని వెదకి పట్టుకోవటానికి.

బాగా వెదకి, అన్ని ప్రయత్నాలు చేసి ఇక దొరకదు అని నిశ్చయించుకుని నెమ్మదిగా వాస్తవాలతో రాజి పడి జీవిస్తున్నాడు. కాని ఒక రకంగా గాడిద అతనికి ఒక అబ్ సెషన్ లాగా అయింది. అప్పుడప్పుడు దానిని తలుచుకుని బాధ పడే వాడు.

అందువల్ల అతని అరుపుని ఇప్పుడు అందరూ లైట్గా తీసుకుని ఇక బస్సుని తిరిగి బయలుదేరదీయబోయారు. డ్రైవర్ కు సైగ చేసి బస్సును ఇక కదిలించమని చెప్పారు.

"అయ్యయ్యో బస్సును ఆపండి, అదిగో దూరంగా పొలాలలో మేస్తూ వుంది నా గాడిద, నేను బస్సు దిగి వెళ్ళి తెచ్చుకుంటా" అని అరిచాడు నాగన్న.

"నీకు మతిగాని పోయిందా, ఎక్కడి తాడిపత్రి, ఎక్కడి కర్ణాటక. నీ గాడిద ఇంత దూరం ఎలా వస్తుంది. పైగా గాడిదలు అన్నీ ఒకే లాగా వుంటాయి. గాడిదను చూసి నీ గాడిద అని అనుకుంటున్నావో, ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కూర్చో" అని అందరు కేకలు వేశారు.

అతడు వింటేగా.

ఆగిన బస్సు దిగి , పొలాల మధ్య నడచుకుంటూ వెళ్ళీ దాని దగ్గర గా నిలబడ్డాడు. చిత్రంగా అది కూడా ఆప్యాయంగా అతని దగ్గరికి వచ్చేసి ప్రేమతో అతన్ని చుట్టేసింది. దాంతో మా అందరికి కూడా రూఢీ అయిపోయింది అది అతనిదే గాడిద అని.

సరే అని చెప్పి మా అప్ప మరో ఇద్దరు నౌకర్లను అతనికి సహాయంగా వుంచి, వారి చేతిలో కొంత డబ్బులు పెట్టి ఇక దాన్ని లారిలోనో ఎలాగో తిసుకు రమ్మని చెప్పి బస్సును బయలుదేరదీశారు.

వాళ్ళంతా గాడిదను తీసుకుని రెండోరోజుకు క్షేమంగా తాడిపత్రి చేరారు.

విధంగా కథ సుఖాంతం అయింది గానీ, దాదాపు మూడు వందల కిలోమీటర్లు గాడిద ఎలా వెళ్ళిందో నాకు ఇప్పటికీ మిష్టరీనే.

No comments:

Post a Comment