"A యాడ్ ఇన్ఫినిటమ్" (తెలుగు
సినిమా) (సస్పెన్స్, థ్రిల్లర్,సైన్స్
ఫిక్షన్)
తెలుగులో ఇంత చక్కటి సైంటిఫిక్
థ్రిల్లర్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
సినిమా పేరు ఎంత గందరగోళంగా ఉందో, సినిమా అంత అద్భుతంగా ఉంది.
ఇది రివ్యూ కాదు. కథ వ్రాయను. కథ
ఒక్క ముక్క చెప్పినా మీకు ద్రోహం చేసినట్టే. ఫ్రెష్ మైండ్ తో, ఒపెన్ మైండ్ తో చూడండి. చూడటం ఆపలేరిక.
ఇంగ్లీష్ సినిమాలకు దీటుగా తీశారు.
ప్రారంభం నుంచి చివరి సన్నివేశం
(దాబాలో ఒకడు టీ త్రాగే దృశ్యం) దాకా మీరు
ఊపిరి బిగబట్టి చూస్తారు. మీ ప్రతి
అంచనాని తలక్రిందులు చేస్తు సాగుతుంది కథనం. అనవసరమైన సన్నివేశాలు
కానీ , అనవసరమైన ట్విస్టులు గానీ, అనవసరమైన పాటలు, అనవసరమైన మాటలు, పోరాటాలు, హడావుడి, హంగామా ఏదీ
లేదు.
కథ, కథనం, నటన , ఫోటోగ్రఫీ,
సంగీతం అన్నీ అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి.
దర్శకుడి ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో
కనపడుతుంది.
హీరోయిన్ చాలా అందంగా ఉంది. ఆమె
ఫ్రేమ్ లో కనిపించిన ప్రతి సందర్భంలో ఒక ఆహ్లాదమైన అనుభూతి కలుగుతుంది
ప్రేక్షకుడికి.
ఎక్కడా శృతిమించిన సన్నివేశాలు
లేవు.
సకుటుంబంగా చక్కగా పిల్ల, పాపలతో, అమ్మానాన్నలతో కూర్చొని చూడదగ్గ
సినిమా.
హీరో: నితిన్ ప్రసన్న
హీరోయిన్: ప్రీతీ అస్రాని
దర్శకుడు: యుగంధర్ ముని
నిర్మాత: గీతా మిన్సాల
సంగీతం: విజయ్ కురవాకుల
ఫోటోగ్రఫీ: ప్రవీణ్ కే. బంగారి
ఎడిటింగ్: ఏ. మణీగండన్, ఆనంద్ పవన్
ఇంత చక్కటి తెలుగు సినిమా మీరు
చూసి ఉండరు. ఎందుకు మరి దీనికి తగినంత పేరు ప్రఖ్యాతులు రాలేదో అర్థం కాలేదు.
అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ రోజు
ఆదివారం కద. హాయిగా చూసేయండి.
5 స్టార్ రేటింగ్ కి అన్ని విధాలా
అర్హమైన చిత్రం.
మీ
రాయపెద్ది వివేకానంద్
No comments:
Post a Comment