’రామ్ కీ బండీ’
ఒక ఙ్జాపకం – 67
***
హైదరాబాద్ వాసులందరికీ
చిరపరిచితమైన పేరిది. కాకపోతే నాకు ఇటీవలే
తెలిసింది. ఓ అయిదారేళ్ళ క్రితం మా పిల్లలు, మేనల్లుళ్ళు
మాట్లాడుకుంటుంటే మొదటి సారి విన్నాను ఆ పేరు.
’రాం కీ బండీ’ గూర్చి ’నాకు తెలియదని’ నేను
చెప్పినప్పుడు వాళ్ళ ఆశ్చర్యానికి అంతే లేదు
’హైదారాబాద్లో ఉంటూ రాం కీ బండీ
గూర్చి తెలియదా?’ అని ఆశ్చర్య పోయారు.
(సిగ్గు చేటు) ఈ మాటని వాళ్ళు పైకి
అనలేదు కానీ వాళ్ళ కళ్ళలో ఆ భావన కనపడింది నాకు, అందుకే బ్రాకెట్స్ లో పెట్టాను సిగ్గుచేటుని .
ఇంతకూ ఏమా రాం కీ బండీ, ఏమా కథ అని అడిగాను. అప్పుడు చెప్పారు దాని గూర్చి వివరంగా.
ఇది వారు చిలవలు పలవలుగీ చెప్పిన
దాని సారాంశం.
ఒక చిన్న తోపుడు బండిపై దోసలు వేసి
అమ్ముతుంటారని, అక్కడి దోశలు తినటానికి ఐటీ ప్రొఫెషనల్స్,
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు (అంటే ధనవంతులు), ప్రముఖులు
(సెలబ్రిటీలు), యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఆధునిక యువత, ఇంకా సమాజంలో ఆధునికులుగా భావింపబడుతూ క్రొంగొత్త పోకడలను
అందిపుచ్చుకునే వారందరూ స్త్రీ పురుష భేదం లేకుండా, వయోపరిమితులకు
లోబడక , వారు వీరు అని తేడా లేకుండా ఇలా ఎవరైనా సరే అక్కడికి
వచ్చి అక్కడి దోశలను స్వీకరిస్తారని నాకు అర్థం అయింది.
గీతా సారంలా ఒక్క ముక్కలో చెప్పాలి
అంటె,
లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయ్యేవారు
అక్కడ దోశె తింటారు
లేదా
అక్కడ దోశె తినేవారు లేటెస్ట్
ట్రెండ్ ఫాలో అయ్యేవారు అని అర్థం. ఇదన్న మాట విషయం.
ఇక్కడ దోశలు మాత్రమే కాక ఇడ్లీలు
కూడా లభిస్తాయి.
దోశెలలో రకాలు:
1
2
3
4
5
6
7
8
ఇక్కడి దోశెలు వంద నుంచి అయిదు
వందల రూపాయలు వరకు ఉన్నట్టు తోస్తోంది ధరల విషయానికొస్తే.
ఏ మాట కామాటే చెప్పుకోవాలి నేను
ఫుడీని కాను.
అదేంటి ఇంకో కొత్త మాట
పట్టుకొచ్చాను అంటారా. అక్కడికే వస్తున్నా.
ఫుడీ అంటే, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే తిండిపోతు అని చెప్పవచ్చు.
కాకపోతే ఇప్పుడీ మాటని కాస్త కొత్త అర్థంలో గౌరవప్రదంగా వాడుతున్నారు. తిండిపోతుగా
ఉండటం ఒక హాబీ (కాలక్షేపం) అనే అర్థంలో వాడుతున్నారు. అంటే రకరకాల ఊర్లలో, రకరకాల ప్రదేశాలలో, వీలయినన్నిఎక్కువ హోటల్స్ లో,వీలయినంత
వైవిధ్యభరితమైన తిండి తినటం ఒక కొత్త హాబీగా అమల్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ టూరిజం (క్యులినరీ టూరిజం లేదా
గాస్ట్రోనమీ టూరిజం ) ఇవన్నీ కూడా ఈ అలవాటు సమాజంలో ఎలా పెరిగిపోతున్నది అని
తెలిపే కొన్ని నిదర్శనాలు.
ఈట్ టు లివ్ డోంట్ లివ్ టు ఈట్
అన్నది పాత మాటగా మారిపోయింది.
బ్రతకటానికి తిండి తినటం అనేది
మారిపోయి, తినటానికే బ్రతకటం అనే సూత్రం ఒకటి
లేటెస్ట్ ఫాషన్ స్టేట్‍మెంట్ గా చలామణిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
పూర్వం ఎక్కడ పడితే అక్కడ తిండి
తినటం తప్పనే భావన ఉండేది. ఇది మా పెద్దలు చెప్పి చెప్పి మా మనసులలో నాటుకు
పోయింది. దేవుని దయ వల్ల నా శ్రీమతి కూడా ఇదే భావజాలం కలిగి ఉంది.
ఎక్కడ తినాలి, ఏ సమయంలో
తినాలి, ఎంత
తినాలి, ఏ
పదార్థాలు తినాలి అన్న విషయంలో ఆరోగ్య శాస్త్ర రిత్యా మనకు వాగ్భటుడు అనే సుప్రసిద్ద ఆయుర్వేద వైద్యుడు వ్రాసిన
ఎన్నో సశాస్త్రీయమైన ఆయుర్వేద గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎంతో విపులంగా
ఆరోగ్యాన్ని ఆహారం ద్వారా ఎలా కాపాడుకోవచ్చో వివరించారు. ఇప్పటి జీవన శైలి ఇవన్నీ
తుంగల్లో తొక్కి విచక్షణా రహితంగా తిండి తినటం, రోగాల బారిన పడి మళ్ళీ కార్పొరేట్
ఆసుపత్రుల జేబులు నింపటం అన్న చందంగా మారింది.
No comments:
Post a Comment