ప్రొద్దుటూరు పార్ట్ 2
ఒక ఙ్జాపకం -29
ప్రొద్దటూరుకు సంబంధించి నేను మీతో
పంచుకుంటున్న ఙ్జ్యాపకాల పరంపరలో ఇది రెండవది.
ప్రొద్దుటూర్ లో బస చేస్తూ అక్కడి
నుండి ఎర్రగుంట్ల సిమెంట్ ఫాక్టరీల ఆసుపత్రులు, జమ్మలమడుగులో
ఆసుపత్రులు కవర్ చేసే వాడిని.
వివరాలు అందించిన మిత్రులు జాన్
వెయిత్ శివకుమార్ , బర్రోస్ వెల్కం కృష్ణన్, బీఈ నాగమోహన్, వాల్టెర్ బుష్నల్ రామకృష్ణ లకు పేరు
పేరునా నా హృదయపూర్వక కృతఙ్జతలు.
వీరందరీ పేర్లముందు వాళ్ళు అప్పుడు
పని చేస్తూ ఉండిన కంపెనీల పేర్లు వ్రాశాను. మేము ఒకర్నొకరం అలాగే పిలుచుకునే వారం
కూడా.
ఇప్పుడు వీరు ఏమి చేస్తున్నారో
ముందుగా తెలుసుకుందాము.
శ్రీ మల్లాది శివకుమార్ గారు
విజయవాడ కేంద్రస్థానంగా ఫైజర్ లో రీజనల్ మేనేజర్ గా చేస్తున్నారు.
శ్రీ ఎస్వీ కృష్ణన్ గారు తమ స్వంత
కంపెనీ నడుపుతున్నారు. వీరు తిరుపతి లో ఉంటారు.
శ్రీ నాగమోహన్ గారు సన్ ఫార్మా
ఆప్థాల్మిక్ డివిజన్ కి నేషనల్ హెడ్ గా
ముంబాయి లో ఉంటున్నారు.
శ్రీ రామకృష్ణ గారు కర్నూలు కేంద్ర
స్థానంగా తన స్వంత వ్యాపారాన్ని చూసుకుంటున్నారు.
ఈ వెంకటేశ్వరా లాడ్జి లో మేము అందరం తరచు కలిసే వారం.
కడప పట్టణంలొ మేమంతా తరచు
కలుసుకుంటూ ఉన్నప్పటికీ ఎవరి వ్యాపకాలలో వారు తలమునకలుగా ఉండేవాళ్ళం, ఎప్పుడైనా ఫీల్డ్ వర్క్ లో కలుసుకున్నా ’హెల్లో’ ’హై’ లకే
పరిమితం అయ్యేవి మా సంభాషణలు.
ఆ రొజుల్లొ ఈ మిత్రులే కాక ఇంకా
అనేక ఇతర కంపెనీల రెప్రజెంటేటివ్స్ కూడా ప్రొద్దటూర్ లో కలిసే వారు. కడప వాళ్ళే కాక
తిరుపతి కేంద్ర స్థానంగా పనిచేసే
రెప్పులు, కర్నూలు
నుంచి వచ్చే రెప్పులు, అనంతపురం నుంచి వచ్చే రెప్స్ ఇలా అందరూ అనుకోకుండా కలిసే వారం. వీరు అందరు వెంకటేశ్వరా లాడ్జిలో దిగే వారు అని
చెప్పలేము. గాంధిరోడ్ లో బీవీఆర్ కాంప్లెక్స్ అని ఇంకొక పెద్ద లాడ్జ్ ఉండేది.
అక్కడ కూడా కొందరు దిగే వారు. ఎవరు ఎక్కడ దిగినా ఇక్కడ అందరూ కలిసే వారు.
వెంకటేశ్వరా లాడ్జి లో ఒక విధమైన
మేధొమధనం లో పాల్గొనే వారం మేము అందరం . డిస్కషన్స్, డిబేట్స్, వాదోపవాదాలు, చర్చోపచర్చలు
ఇలా వాడిగా వేడిగా జరిగేవి.
ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి
అంటే,
టీటీకే లో పని చేసే పీ.మోహన కుమార్
గాంధీ (ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ) గారు, అరిస్టో
కంపెనీలో పని చేసే రాము, బ్రవున్ అండ్ బర్క్ మూర్తి, థెమిస్ రావు గారు వీరందరూ కళాకారులు. మనం బస చేసే టయం లో వారు కూడా
ఉన్నారంటే పండగే. గాంధీ పాటలతో పొద్దు తెలిసేది కాదు. మూర్తి కవితలు అల్లి
వినిపించే వాడు.
సాధారణంగా బయోఎథికల్స్ లో పనిచేసే
భాస్కర్ , నేను కలిసి వెళ్ళేవారం ఎక్కడికి వెళ్ళినా.
సంగీతం, సాహిత్యం విషయంలో మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే .
ఇద్దరం శాకాహారులం. అన్నదమ్ములమేమొ అన్నంతగా కల్సిపొయాము మేము.
ఇలా పాపులర్ పెయిర్స్ చాలా ఉండేవి.
లుపిన్ రాజు, వొఖార్డ్ ఇంతియాజ్ (పేరు సరిగ్గ గుర్తు
లేదు) వీళ్ళిద్దరు విడదీయరాని జోడి. వీళ్ళిద్దరూ తమిళనాడు నుంచి ఇక్కడకి ట్రాన్స్ఫర్ అయివచ్చి పని చేసేవారు.
వీరిలో లుపిన్ రాజు గారు మా
కుటుంబానికి చాలా సన్నిహితులు అయ్యారు కూడ. నేను అనేక సార్లు ఆ తర్వాత చెన్నయ్
వెళ్ళినప్పుడు వీరి ఇంటిలో దిగే వాడిని.
హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చి
ఉండేవారు. వీళ్ళవల్ల తెలంగాణా తెలుగు మాట్లాడటం ఒక ఫ్యాషన్ క్రింద చలామణిలో ఉండేది
మాలో.
ఇలా ఎందరెందరో కలిసే వారం అక్కడ.
పగలంతా చాలా డెడికేటేడ్ గా పని చేసుకుని రాత్రి పడుకునే ముందు సరదాగ కబుర్లు
వాదోపవాదాలు చేస్కుని ఎవరి రూముల్లొ వాళ్ళు పడుకునే వారం. ఎప్పుడెవరు కలుస్తారో
తెలియదు. ఎవరి షేడ్యూల్ వారిది.
ఇక్కడ ఒక ముఖ్య విషయం. సాధారణంగా
అప్పట్లో సమాజంలో ఒక అపోహ ఉండేది. మెడికల్ రెప్పులు అందరూ మద్యపానం చేస్తారు అని.
చెప్పాను కద అది పూర్తిగా అపోహ అని. అస్సలు మద్యపానం చేయని వారు చాలామందే ఉండేవారు
మాలొ ఆ రోజుల్లొ.
’బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్’ అంటారు
కద. నేను మద్యపానం చేయను, ధూమపానం చేయను, శుద్ధశాకాహారిని
అందునా కేవలం శాకాహారం మాత్రమే వండి వార్చే హోటళ్ళలోనే తింటానా, నా నియమాల వల్ల నాకు ఏనాడు ఇబ్బందులు అవమానాలు ఎదురుకాలేదు. నాకు తోడు బోయిన వాళ్ళు నాతో ఉండెవారు.
ఒకటి మాత్రం నిజం ప్రతిఒక్కరం చాలా
నిబద్దతతొ పని చేసే వారం. మాదే స్వంత కంపెనీ ఏమో అన్నంత శ్రద్ధగా పనిచేసుకుని
పోయేవారం.
మా వర్క్ అంతా డాక్టర్లతోనే
కద. ప్రొద్దుటూరులో డాక్టర్లు అధికభాగం
గాంధీరోడ్డు అనే ఒక ఏరియాలో ఉండెవారు. అందువల్ల నడుచుకుంటూనే పని చేసుకునే వారం.
మాలో కొందరు కడపనుంచి మోటార్ సైకిళ్ళపై వచ్చే వారు. నేను అరుదుగా టూవీలర్ పై
వెళ్ళేవాడిని. అధికభాగం బస్సుల్లోనే వెళ్ళేవాడిని.
ఇక స్టాకిస్టుల గురించి.
ముందుగా ఫార్మా మార్కెటింగ్ గూర్చి
తెలియని వారికి అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం మందులషాపుల్లో
కొనుక్కునే మందులు, ఈ షాపులవారికి హోల్ సేల్ డీలర్ల వద్ద నుంచి
వస్తాయి. ఈ హోల్ సేల్ డీలర్స్ ని స్టాకిస్టులని మేము పిలుచుకోవటం కద్దు. కడపలో,
ప్రొద్దుటూరు లొ ప్రతి కంపెనికి పరిమిత సంఖ్యలో స్టాకిస్టులు
ఉండేవారు.
మాకు కడపలో ఒక్కడే స్టాకిస్టు ఉంటే, ప్రొద్దుటూరు లో ముగ్గురు స్టాకిస్టులు ఉండేవారు. కారణం
సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరు చాలా ఐశ్వర్యవంతమయిన ఊరు. ఇక్కడ
వ్యాపారులు చాలా ఐశ్వర్యవంతులు.
ప్రొద్దుటురు ని సెకండ్ బాంబే అని పిలవడం కూడా కద్దు.
ప్రొద్దటూరులో ఫార్మాస్యూటికల్
వ్యాపారం ప్రధానంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరిగేది. వీరు చాలా ఆచితూచి నిర్ణయాలు
తీసుకుంటారు, నిర్ణయం తీసుకున్న తరువాత ఇక మీనం మేషం
లెక్కపెట్టరు, దూకుడుగా నిర్ణయాలని అమలు పరిచేస్తారు. అధిక
లాభాలు రావాలి అన్న పట్టింపు కూడా ఉండదు వీరికి, కాస్తా లాభం
వచ్చే అవకాశాలు ఉన్నా కూడా వ్యాపారం జరుగుతూ ఉంటె చాలు అన్న విధంగా చాలా
సకారత్మకంగా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. ఏతావాతా కంపెనీలకు అనుకూలమైన వాతావరణం
ఉండేది.
వెంకటేశ్వర లాడ్జి ప్రక్కనే మాకు
తిరుమల మెడికల్ ఏజెన్సీ అని ఒక చక్కని స్టాకిస్టు ఉండేవారు. శ్రీ వెంకటేశ్వర్లు
గారు అక్కడ నిర్ణయాత్మక వ్యక్తి ( కీ పర్సన్). వారి కజిన్ శ్రీ సురేష్ అనే యువకుడు
కూడా కీలక పాత్ర పోషించే వారు.
చాలా చిన్న స్థలంలో నడపబడేది.
కూరగాయల మార్కెట్ వైపునుంచి ప్రవేశించాలి వీరి షాపు లోకి.
మనం అక్కడికి ఎంటర్ అవ్వంగానే
మనస్సు ఉత్సాహంగా మారిపోయేది. వారు నన్ను చాలా ఇష్టపడేవారు. నేను కూడా మా స్టాకిస్టులందరిలోకి వీరిని
ఎక్కువ ఇష్టపడేవాడిని.
అక్కడ ఎప్పుడు చూసినా ఒక పండగ వాతావరణం
నెలకొని ఉండేది. వీళ్ళ ఫీల్డ్ సేల్స్ రెప్రజెంటేటివ్ శ్రీ నరసింహులు గారు అని ఒక
నడివయస్కుడు ఉండేవారు. ఆయనకి మార్కెట్ పల్స్ బాగా తెల్సు. ఆయన తీసుకువచ్చే
ఆర్డర్స్ భారిగా ఉండేవి. ఈ నరసింహులు గారిని కపిల్ దేవ్ అని వ్యవహరించే వారం. అంటె
కపిల్‍దేవ్ కీలక సమయంలో బ్యాటింగ్ కి దిగి
సిక్సర్లు కొట్టడం ప్రారంబిస్తే కసిగా ఎలా సెంచరీలు నమోదవుతాయో, ఈ నర్సింహులు ఒకసారి టూర్ కెళ్ళీ ఆర్డర్స్ పట్టుకొచ్చాడు అంటే
భారిగా ఉండేది మా బిజినెస్.
ఆయన ఆర్డర్స్ ని బట్టి, ఇతర మార్కెట్ అవసరాలను బట్టి వెంకటేశ్వర్లు గారు మాకు (అంటే కంపెనీకి) ఆర్డర్ పెట్టేవారు.
ఈ ఆర్డర్ ఆధారంగా మాకు కంపెనీలో
గుర్తింపు ఉండేది.
ఈ స్టాకిస్టులు మంచి ఆర్డర్
ఇవ్వాలి దేవుడా అని మొక్కుకుని కడప నుంచి బయలుదేరే వాడిని. ఒక్కోసారి నెలాఖరున
కంపెనీ వారు ఒత్తిడి చేసేవారు. అప్పుడు జై
పరమేశ్వరా అని మళ్ళీ ప్రొద్దుటూరుకు బయలుదేరే వాడిని.
నేను అడిగినంత మేరా ఆర్డర్
పెట్టేవారు, ఒక్కోసారి పెద్దపెద్ద స్టాకిస్టులు కూడా
ఇవ్వనంత ఆర్టర్స్ వీరు సునాయసంగా ఇచ్చేవారు.
మాకున్న మిగతా స్టాకిస్టు లతో
పోలిస్తే ఈ తిరుమల ఏజెన్సీస్ చాలా చిన్న స్టాకిస్టు. బహుశా వారు అప్పుడప్పుడే
ఎదిగే క్రమంలో ఉండేవారు అనుకుంటాను. నాకు తెలిసి ఈ పాటికి వారు చాలా మంచి స్థితిలో
ఉండి ఉంటారు. ఎందుకంటే వారిలో ఎదగాలి అనే తపన బలంగా ఉండేది.
శ్రీ వెంకటేశ్వర్లు గారు కంపెనీ
రెప్రజెంటేటివ్స్ తో చాలా చక్కగా మాట్లాడేవారు, ఆదరించేవారు.
వారి ఆఫీసులో నేను ఎప్పుడు వెళ్ళినా నాకు వీఐపీ ట్రీట్ మెంట్ లభించేది.
అక్కడ పని చేసే కుర్రాళ్ళు కూడా
చాలా స్వేఛ్ఛగా పాటలు పాడుతు, ఆటలు ఆడుతూ పని
చేసుకుని పోయేవారు. వారిలో ఎలాంటి ఒత్తిడి కనిపించేది కాదు. అలాంటి చక్కటి
వాతావరణం కల్పించిన శీ వెంకటేశ్వర్లు గారు చాలా దార్శనికులు అని చెప్పాలి.
కుర్రాళ్ళు సినిమాల గూర్చి మాట్లాడుతూ, హీరోయిన్ల గూర్చి
జోకులు వేస్తూపని చేసుకుని పోయేవారు. వాళ్ళందరిలోనూ పనిలోనే ఆనందం కనిపించేది. ఆ
కుర్రాళ్ళలో ఒక కుర్రాడి పేరు ఇప్పటికీ గుర్తే , చంటీ అని
తెగ పిలిచేవారు. . అప్పటికి ఇంకా కంప్యూటర్ల వాడకం అంత విరివిగా పుంజుకోలేదు. అంతా
మాన్యువల్ అకౌంటింగ్, మాన్యువల్ వర్క్.
స్ట్రెస్ ఫ్రీ వర్కింగ్ కి ఈ
ఆర్గనైజేషన్ ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఎవరైనా మార్కెటింగ్ కన్సల్టెంట్
వారు ఈ సంస్థని స్టడీచేస్తే బోలేడు మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకోవచ్చు.
దీనికి వ్యతిరేకమైన వాతావరణం నాకు
ఇతర స్టాకిస్టుల దగ్గర కనిపించేది.
ఈ సంస్థకి వెళ్ళి వచ్చిన ప్రతి సారి నాలో కూడా కొత్త
ఉత్సాహం ఊపిరిపోసుకునేది.. ఇక ఆర్డర్లు అంటారా వాటికి ఎప్పుడూ కొదవలేదు. తిరుమల అంటే ఒక గోల్డ్ మైన్. మిగతా కంపెనీ
రెప్పులు కూడా ఇదే చెప్పేవారు.
ఇక్కడ నాకు సిస్టోపిక్ సతీష్ అనే
ఫ్రెండ్ తరచు కలిసేవాడు.
ఇక ఇంకో స్టాకిస్టు
మేడా మెడికల్ ఏజెన్సీస్. ఆ తరువాత ఇది రెండుగా విడిపోయి , మాకు మరో స్టాకిస్టు ఉద్భవించడం జరిగింది.
మేడా మెడికల్ ఏజెన్సీస్ చాలా పెద్ద సంస్థ. శ్రి కృష్ణయ్యగారు దీనికి ఓనర్. ఆయన
తమ్ముడు శ్రీ రమేష్ కూడా కీలక పాత్ర పోషించే వాడు.
వ్యాపారంలో తల పండిన
అనుభవుఙ్జుడు శ్రీ కృష్ణయ్య గారు.
శ్రీ కృష్ణయ్యగారు చాలా ఖరాఖండి
మనిషి. వారి మనసు మంచిదే అయినప్పటికి ఎదుటి వారికి అలుసు కాకుడదు అన్న దృష్టితో
అనుకుంటా చాలా ఖచ్చితంగా మాట్లాడేవారు. మేడికల్ రెప్రజెంటేటివ్స్, మేనేజర్లతో మాత్రమే కాదు వారు తమ సామాజిక సంబంధాల విషయంలో
కూడా అలాగే ఉండేవారు. దేవుని దయవల్ల నాతో చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. బహుశా ఈ
బక్కపలచటి పిల్లవాడితో ఇబ్బంది ఉండదనుకున్నారేమో ఆయన.
ఏది ఏమయినా వారు టాప్ బిజినెస్
పర్సన్స్ లో ఒకరు. మేడా మెడికల్ ఏజెన్సీస్
వారు మన కంపెనీ స్టాకిస్ట్ అని చెప్పుకోవటానికి మనం గర్వించదగ్గ స్థాయి వారిది.
దేవుని దయ వల్ల నేను పనిచేసే కంపెనీ కూడా ఇండియాలోని టాప్ టెన్ కంపెనీస్ లో ఒకటి
కావటం వల్ల మా కంపెనీ ఏజెన్సీ తీసుకోవటానికి స్టాకిస్టులు పోటీ పడేవారు. మేడా వారి
వద్ద అన్నీ టాప్ లెవల్ ఎమ్మెన్సీ కంపెనీలే ఉండేవి. ఆయన చిన్న చిన్న కంపెనీల గూర్చి
అసలు ఆలోచించేవారు కూడా కాదు. థింక్ బిగ్ అన్నది ఆయన విధానం.
ఈ కృష్ణయ్యగారు అయ్యప్ప భక్తులు.
ఒక సారి శబరిమల యాత్రకి వెళ్ళినప్పుడు అనుకుంటాను ఆయన పెద్ద రోడ్డుప్రమాదానికి
గురయ్యారట. చాలా పెద్ద ప్రమాదం. ఇదంతా నేను ఉద్యోగంలో చేరక ముందే జరిగిన సంగతి. ఆ
భయానక సంఘటనని తమ సంభాషణలో ఆయన తరచు తలచుకునే వారు . ఆ ప్రమాదం కారణంగా వారి తల పై
భాగం బాగా దెబ్బతిని కాస్తా ఆయన తల రూపం మారి ఉంటుంది, నుదురు పైన ఒక వైపంతా తల పైభాగం షేప్ మారిపోయి ఉంటుంది. ఆ
ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడటం దైవకృప అని ఆయనే అంటారు. ఈ కారణంగా కూడా ఆయనకి
దైవభక్తి ఎక్కువ.
కృష్ణయ్యగారు, ఆయన తమ్ముడు, వారికి వరసకి పెదనాన్న
ఒకాయన వ్యాపారం చూసుకునే వారు. కీలక నిర్ణయాలు అన్నీ కృష్ణయ్యగారే తీసుకునే వారు.
కృష్ణయ్య గారు ఉన్నారు అంటే వాతావరణం అంతా మిలటరి క్యాంపులో ఉన్నట్టు ఉండేది. ఆ
రోజుల్లో కంప్యూటర్ని ఉపయోగించిన అతి కొద్ది మంది స్టాకిస్టులలో ఆయన ఒకరు. దానికి
గాను ప్రత్యేక అద్దాల క్యాబిన్, దానికి ఏసీ, డాట్ మేట్రిక్స్ ప్రీంటర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా
చాలా పకడ్బందీగా ఉండేది ఆయన వ్యవహార శైలి.
కంపెనీలతో కూడా చాల ముక్కు సూటిగా
ఉండేది ఆయన వ్యవహార ధోరణి. ’మీ ఒక పైసా నాకు
ఎక్కువ వద్దు, నాకు రావాల్సిన ఒక పైసా మీరు క్షణం ఆలశ్యం
చేయవద్దు’ ఇది ఆయన నినాదంగా ఉండేది.
మెడికల్ రెప్రజెంటేటివ్స్ కి
సేల్స్ ఆర్డర్ ఇవ్వటంలో కూడా ఇదే నియంతృత్వ ధోరణే.
ఈ క్రింది ఫార్ములా చూడండి.
2
X Sales - (Closing Stock) = Sales Order
ముక్కు సూటిగా వ్యవహరించాలి అంటే
ఇది మా ఆర్డర్ అడిగే విధానం. అంటే దీనివల్ల వారు ఇన్వెంటరీ (ర్యాక్ స్టాక్)
సఫిషియెంట్ గా మెయిన్‌టెయిన్ చేయాలి. ఇది
అన్ని వేళలా కుదరదు. అంటే వారి కాష్ మా స్టాక్ మెయింటెయిన్ చేయటంలో
ఇరుక్కుపోతుంది.
అందుకే ఆయన "ఈ ఫార్ములాలు
గీర్ములాలు మడిచి మీ ఎమ్.బీ.ఏ టెక్స్ట్ బుక్స్ లో పెట్టుకోండి. నేను ఇచ్చిన సేల్స్
తీసుకుని వెళ్ళండి" అని ఆయన చీకాకు పడిపోయే వాడు.
దేవుని దయ వల్ల నేను ఎప్పుడు
వెళ్ళినా చాలా ఉత్సాహంగా పలకరించి, నాకు
కావాల్సిన్ ఆర్డర్ ఇచ్చేవారు. నేను తగినంత హోం వర్క్ చేసుకుని వెళ్ళే వాడిని. ఈ
ఫార్ములా ప్రసక్తే తేకుండా , ఆయన ఇష్ట ప్రకారం ఆర్డర్
తీస్కుంటున్నట్టు గా వ్యవరించే వాడిని.
ఈ యావత్తు వ్యవహారంలో వారి తమ్ముడు
శ్రీ మేడా రమేష్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నాకు సాయపడేవారు.
బలవంతుడిదే రాజ్యం అన్న సామెత
ఉండనే ఉంది కద. ప్రక్క జిల్లాలకు చెందిన పెద్ద పెద్ద స్టాకిస్టులు ఇక్కడివి వచ్చి, మెడికల్ షాప్ వారికి కావాల్సినంత సరుకు అప్పుగా ఇచ్చి
వెళ్ళేవారు. వీరిని ఎదుర్కోవటానికి మన స్టాకిస్టులు కూడా మెడికల్ షాపుల
వారికి ఉదారంగా అప్పు మీద సరకు ఇవ్వడం ఒక్కటే మార్గం అన్న
పరిస్థితి ఉండేది. , లేదా వీళ్ళు ఇంకో జిల్లాకు వెళ్ళి
నమ్మకస్తుతులైన మెడికల్ షాపులకు అప్పుమీద సరకు ఇచ్చి రావటం అన్న పద్దతి
ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
మొత్తాన్కి వీరు వ్యాపారం కూడా
చాలా రిస్క్ తో కూడుకున్నది.
ఈ రమేష్ యువకుడు, ఉత్సాహవంతుడు. అతనికి దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలి అని
ఉండేది. అయినా అన్నగారి మీద గౌరవంతో నెమ్మదించేవాడు. ఆ తరువాత ఈ రమేష్ వాళ్ళ
అన్నగారి నుంచి విడివడి స్వంతంగా మేడా మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అన్న సంస్థని
ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల
ప్రొద్దటూరు లో మాకు మూడవ డిస్ట్రిబ్యూటర్ని (స్టాకిస్టు) అపాయింట్
చేసుకోవటాని అవకాశం వచ్చింది.
మన ఇష్టారాజ్యంగా స్టాకిస్టులని ఏర్పాటు
చేసుకునే అవకాశం ఉండదు. ఈ స్టాకిస్టులకి ఒక అసోసియేషన్ ఉండేది. మనకున్న
స్టాకిస్టులు ’నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ ఇస్తేనే మనం ఇంకో కొత్త స్టాకిస్టును
ఏర్పాటు చేసుకోగలం. రమేష్ గారు స్వయాన తమ్ముడే కావటం వల్ల కృష్ణయ్యగారు ఎన్. ఓ.సి
ఇచ్చారు.
ఇందాక చెప్పిన తిరుమల
వెంకటేశ్వర్లు గారు సహృదయులు కావటం వల్ల మాకు సులభంగానే ఎన్.ఓ.సీ వచ్చింది.
ఇది ఒక ఆఛీవ్‍మెంట్ ఆ రోజుల్లో.
నేను నాట్కో ఫార్మా లో తమిళనాడులో
డిస్ట్రీబ్యూషన్ వ్యవస్థని నెలకొల్పడంలో ఈ
అనుభవం నాకు బాగా ఉపయోగ పడింది. అక్కడ నేను అనేక రికార్దులు సృష్టించాను.
రీలాంచింగ్ దశలో ఉన్న కంపెనీకి, ఇంకా ప్రాడక్ట్
లిస్టు కూడా లేని దశలో స్టాకిస్ట్ వ్యవస్థని ఏర్పాటు చేశాను. ప్రతి స్టాకిస్ట్
నుంచి ఒక లక్ష రూపాయలకు అడ్వాన్స్ చెక్ తీస్కుని స్టాకిస్టులని అపాయింట్ చేశాను.
ఇది ఒక రికార్డు ఆ రోజుల్లొ . నాట్కో అధినేత సాక్షాత్తు శ్రీ నన్నపనేని గారి నుంచి
అభినందనలు అందుకున్నాను ఈ విషయంగా.
ఈ విధంగా ప్రొద్దుటూరు లో పని
చేసిన అనుభవం నాకు ముందు ముందు బాగా ఉపయోగ పడింది.
ఇక్కడితో రెండవ భాగం సమాప్తం.
(నాతో పాటు ఆ రోజుల్లొ పనిచేసిన
వివిధ కంపెనీల మిత్రుల వివరాలు నాకు
గుర్తు ఉన్నంత వరకు ఇస్తున్నాను.
నాకు గుర్తు ఉన్నంత
మేరకు ముఫై సంవత్సరాల క్రితం నాటి మిత్రుల పేర్లు వ్రాశాను. ఎవరిపేరు అయినా మిస్స్
అయి ఉంటే మన్నించేది.)
1.
Ashraff (Ranbaxy)
2.
Babu (Biochem)
3.
Dayaakar (Himalaya)
4.
Dayakar Reddy
(Allembic)
5.
Ganesh (Boots)
6.
Gouri Shankar (SIRIS)
7.
Jayanth (Cadila &
SOL)
8.
Koteswara Rao
(Humana)
9.
Krishna (Germana Remedies Tragedy)
10.
Krishna Mohan (SG)
11. Lakshmi Narayana (Sun)
12. Madhu (Zieta- Cadila)
13.
Murali krishna (Glenmark) ఈయన్ని నాగార్జున
అనేవారం అప్పట్లో.
14.
Muralidhar Reddy (Blue cross)
15. Murthy (BPRL)
16. Murthy (Sigma)
17.
Nagamohan (BE)
18.
Nagendra (Torrent)
19. Narasimha (Natco)
20. Narasimha Chaaryulu (Apt Labs)
21. Paravateesam (SOL)
22. Prabhakar (Glaxo)
23. Prabhu (Stangen)
24. Prasad (Stancare)
25. Raja (Ranbaxy Division - He is brother of film actress
Y.Vijaya)
26. Raju (British Biologicals)
27. Ramakrishna (Walter Bushnel)
28. Ramana Reddy (Spic )
29. Ravi (Fulford)
30. Reddappa Reddy (Roofers)
31.
Samudraala Gopi (German Remedies)
32. Sashi (Cadila)
33.
Sathyam (BE)
34. Satish (Smith and Kenner)
35. Satish (Systopic)
36. Seenu (Humana)
37. Sesha Reddy (Pfizer)
38. Shyam (Megacare)
39. Simon (Pfizer)
40. Sridhar (Parke Davis)
41. Srinivas Reddy (Pfimex)
42. Sriramulu (Sarabhai)
43. Subbaa Rao (Fulfoford )
44. Tilak (SKF)
45. Venkat Reddy (Vanguard)
46. Venkata Subbaiah (Madras Medials)
47. Venkatesh (CAdila)
48. Venkateswarlu (Cross Lands)
49.
Venu (Hoechest)
50. Vijay (Camlin)
51. Younus (Rallis)
52. Walkman Sale Man (I don’t remember the name of the guy.
He is vey friendly nice guy)
ఇక్కడ నా వివాహం నాటి
ఫోటో కూడా పెట్టాను. నా వివాహం బళ్ళారి కర్ణాటకలో జరిగింది. అందులో ఉన్న వారంతా మా
ఇప్కా కంపెనీ స్టాఫ్.
No comments:
Post a Comment