అద్భుతం
ఈ సందర్బంగా ఒక ముచ్చట.
ఎదుగుతున్న క్రమం లో తమ పాత రచనల్లో లోపాల్ని తామే గ్రహించి బయట పెట్టుకోవటం గొప్ప సంస్కారం.
జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పటికీ ఈ పాటలో ఒక లోపం ఉందని మహాకవి తన పుస్తకం 'పాడవోయి భారతీయుడా ' లో వ్రాసుకున్నారు.
అది ఏమిటంటే
'ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగుల గొట్టి, *సింహాలై* గర్జించాలి... '
ఇది పాట.
కానీ, ప్రతి మనిషి అనేది ఏకవచనం కాబట్టి, సింహం లా గర్జించాలి అని ఉండాలి, తాళం కూడా తప్పదు. కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది అని బాధ పడ్డారు మహాకవి శ్రీ శ్రీ.
ఇలా స్వీయలోపమ్ములు ఎరుగుటలో రంగనాయకమ్మ, యండమూరి లు కూడా చాలా ముందున్నారు.
యండమూరి దేముడు అని వ్రాయకూడదు అని తెలుసు నాకు, అయినా దేవుడు అని వ్రాయాల్సిన దగ్గర నాకు తెలియకుండా దేముడు అని వ్రాస్తాను అని చెప్పుకున్నారు.
చలం గారు కూడా అరుణాశ్రమం చేరిన కొన్నాళ్ళకి తన రచనలు అన్నింటిని disown చేసుకున్నారట.
ఈ సినిమాకు డైరెక్టర్ గారు రామచంద్ర రావు గారు, సినిమా మధ్యలోనే చనిపోయారు. కానీ వారు టైటిల్స్ లో తన పేరు వేయాలని మాట తీసుకుని చనిపోయారు అట.
వాస్తవానికి తతిమ్మా చిత్రమంతా సూపర్ స్టార్ కృష్ణ గారే డైరెక్షన్ చేశారు. పోరాట దృశ్యాలు శ్రీ కే ఎస్ అర్ దాస్ గారు చేసుకున్నారట.
కానీ సంస్కారానికి మారుపేరైన శ్రీ కృష్ణ గారు రామచంద్ర రావు గారి పేరే టైటిల్స్ లో వేసారట.
సూపర్ స్టార్ కృష్ణ గారికి వాస్తవానికి ఎడిటింగ్ పైనే గాక 24 క్రాఫ్ట్స్ పై మంచి పట్టు ఉందట.
ఆయన ఏదయినా సినిమా రషెస్ చూసి, అది హిట్టో కాదో నిర్మొహమాటంగా లాబ్ లోనే చెప్పేసే వారట.
ఆయన ఎడిటింగ్ కి పరాకాష్ట దేవుడు చేసిన మనుషులు సినిమా అంటారు.
అన్న గారు కూడా బెంబేలెత్తి పోయారట ఆ సినిమా initial రషెస్ చూసి. అప్పుడు కృష్ణ గారు పూనుకుని ఒక్క రోజు లో ఆ సినిమా రూపు రేఖలే కాదు ఆ సినిమా జాతకమే మార్చేశారట మన సూపర్ స్టార్ గారు.
అది విషయం
No comments:
Post a Comment